Posts

Showing posts with the label movies

‘ప్రేమకి రెయిన్‌చెక్‌’ కథానాయిక ప్రియా వడ్లమాని telugu actress prriya vadlamani film pramaki rain check

Image
నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచబోతున్నా అంటున్నారు ప్రియా వడ్లమాని. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రేమకి రెయిన్‌చెక్‌’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ప్రియా వడ్లమాని సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘తన ప్రపంచంలో తానుండే నేటితరం అమ్మాయి పాత్ర నాది. తనకంటూ జీవితంలో కొన్ని విలువలుంటాయి. సాహసోపేతమైన విషయాలతో ముడిపడ్డ ఓ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఆ పాత్ర పరంగా సినిమాలో పలు    సాహసాలు చేయాల్సొచ్చింది. వ్యక్తిగతంగా నాకూ సాహసాలంటే ఇష్టం. అందుకే ఎలాంటి డూప్‌ లేకుండా నటించా. ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం’’. * ‘‘మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, వాళ్లు తిరిగి మనకు వెంటనే సహాయం చేయడానికి సిద్ధపడతారు. అలా కాకుండా నేను అడిగినప్పుడు సహాయం చేయండని అడిగితే దాన్నే రెయిన్‌ చెక్‌ అంటారు. ఈ చిత్రాన్ని ఆకెళ్ల పేరి    శ్రీనివాస్‌ బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రారంభానికి ముందే ఒక వర్క్‌షాప్‌ చేయడంతో సులభంగా నటించగలిగా. నేను పుట్టి పెరిగ...