‘అర్జున్‌ రెడ్డి అత్తారింటికి దారేది’ ‘రెడీ’ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ ‘బృందావనం’‘విక్రమార్కుడు’ ‘వర్షం’ ‘పోకిరి’.చిత్రం సినిమా arjun reddy, kick ,vikramarkudu,shimbu,ready,okkadu,hasini,brindavanam,varsham,pokiri,maryada ramanna,nuvasthanante vaddantana,attarintiki daredi movies,cinemas

‘అర్జున్‌ రెడ్డి’ 3... ‘విక్రమార్కుడు’ 5... ‘కిక్‌’ 3
ఇవి ర్యాంకులు కావు... రీమేక్‌లు
‘పక్కింటి పుల్ల కూర రుచి’... తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకునేటప్పుడల్లా ఈ మాటే అనేవారు. అక్కడెక్కడో విజయం సాధించిన సినిమాల్ని మనవాళ్లు తీసుకొచ్చి... మన మసాలా దట్టించి ప్రజలకు అందిస్తారని అనుకునేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు మారాయి. మనం సినిమాలు తెచ్చుకోవడం స్థానే మన సినిమాలు పక్క రాష్ట్రాల పరిశ్రమలకు వెళ్తున్నాయి. తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ, హిందీ పరిశ్రమలకు వెళ్లాడు. అలాగే ‘అత్తారింటికి దారేది’ తమిళంలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలుగులో విజయం సాధించి ఇతర పరిశ్రమలకు వెళ్లిన సినిమాలేంటో చూద్దాం!



తెలుగు సినిమాలో ఇటీవల కాలంలో ట్రెండ్‌ సెట్టర్‌ అంటే ‘అర్జున్‌ రెడ్డి’ అని చెప్పొచ్చు. డాక్టర్‌ అర్జున్‌ రెడ్డి పాత్రలో విజయ్‌ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఈ బోల్డ్‌ పాత్ర ఒప్పుకున్నందుకు విజయ్‌పై ప్రశంసల వర్షం, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇప్పుడు ‘విజయ్‌’ పాత్రలోకి తమిళం నుంచి విక్రమ్‌ తనయుడు ధృవ్‌, హిందీ నుంచి షాహిద్‌ కపూర్‌ సిద్ధమయ్యారు. ఈ సినిమా తమిళంలో ‘వర్మ’ పేరుతో రూపొందుతోంది. హిందీలో త్వరలో పట్టాలెక్కనుంది. షాహిద్‌ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు.

* శింబు చేస్తున్నాడు

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ₹180 కోట్లకు పైగా వసూలు చేసిందనేది సినిమా వర్గాల మాట. ఈ జోరు ఇక్కడే కాదు కన్నడలో కొనసాగింది. ఈ కథతో 2015లో రూపొందిన ‘రాన్న’ కన్నడ నాట మంచి విజయాన్ని అందుకుంది. బెంగాళీలో జీత్‌ కథానాయకుడిగా 2016లో ‘అభిమాన్‌’ పేరుతో సినిమా రీమేక్‌ అయ్యింది. ఇప్పుడు తమిళంలో శింబు కథానాయకుడిగా సినిమా రూపొందుతోంది. సుందర్‌.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

* పేరు మారినా.. వినోదం అదే
రామ్‌- బ్రహ్మానందం కలిసి నవ్వులు పూయించిన సినిమా ‘రెడీ’ వినోదం ప్రధానంగా సాగిన ఈ సినిమా మన దగ్గరే కాదు.. బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ ఇలా విడుదలైన ప్రతి చోట మంచి విజయాన్ని అందుకుంది. హిందీలో 2011లో సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో అదే పేరుతో సినిమా విడుదలైంది. అక్కడ సల్మాన్‌ సినిమాల్లో మంచి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘రామ్‌’ పేరుతో చేశాడు. 2009లో వచ్చిన ఈ సినిమాకు అక్కడ మంచి ఆదరణ దక్కింది. తమిళంలో ధనుష్‌ ‘ఉత్తమ్‌ పుతిరన్‌’గా ఈ సినిమాను 2008లో తీసుకొచ్చాడు.

* బాలీవుడ్‌లో నడవలేదు
మహేష్‌ బాబు కెరీర్‌లో భారీ విజయాలు అందుకున్న సినిమాల్లో ‘ఒక్కడు’ మరచిపోలేనిది. కమర్షియల్‌ చిత్రమే అయినా... సినిమాలో మహేష్‌ హీరోయిజం ఇప్పటికీ తెలుగు సినిమాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గానే ఉంది. ఈ సినిమా అయితే ఏకంగా ఐదు ఇతర భాషల్లో రీమేక్‌ అయ్యింది. 2004లో విజయ్‌ ‘గిల్లీ’ పేరుతో ఈ సినిమాను తమిళనాడుకు తీసుకెళ్లాడు. హిందీలో అర్జున్‌ కపూర్‌ 2015లోఈ సినిమా చేశాడు. ‘తేవర్‌’గా వచ్చిన ఈ సినిమా అక్కడ సరైన విజయం అందుకోలేకపోయింది. 2008లో బెంగాళీలో ‘జోర్‌’గాను, ‘అజయ్‌’ (2006)గా కన్నడలో, ‘మాటె అనిదెలా’ (2008)గా ఒడియాలోనూ ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల సినిమాకు మంచి స్పందనే వచ్చింది.

* ఐదు భాషల్లోకి
వెంకటేశ్‌, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఫక్తు కమర్షియల్‌ సినిమాలకు దూరంగా వచ్చిన ఈ సినిమా మరో ఐదు భాషల్లోకి రీమేక్‌ అయ్యింది. 2008లో ధనుష్‌ ఈ సినిమాను ‘యారాడి నీ మోహిని’గా తమిళంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ‘అంతు ఇంతు ప్రీతి బంతు’ పేరుతో కన్నడలో 2008లో రీమేక్‌ అయ్యింది. ఒడియాలో ‘ప్రేమ అదేయ్‌ అక్ష్యర’ పేరుతో రాగా, ‘100 పర్సంట్‌ లవ్‌’ పేరుతో బెంగాళీలో రీమేక్‌ చేశారు. గతేడాది భోజ్‌పురిలో ‘మెహందీ లగాకే రక్నా’ పేరుతో వచ్చింది
.

* హాసిని సందడి
‘హ.. హ.. హాసిని’, ‘అంతా మీరే చేశారు..’ ఈ రెండు మాటలు చాలు ఏ సినిమా గురించి చెబుతున్నామో. ఆ సినిమానే ‘బొమ్మరిల్లు’. సిద్ధార్థ్‌, జెనీలియా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగాళీలో ‘భలో బస భలో బస’గా ఈ సినిమా రీమేక్‌ అయ్యింది. తమిళంలో జయం రవి, జెనీలియా జంటగా 2008లో ‘సంతోష్‌ సుబ్రమణియన్‌’గా సినిమాను రీమేక్‌ చేశారు. ఒడియాలో ‘డ్రీమ్‌ గాళ్‌’ (2009)లో పునర్‌ నిర్మించారు. అన్ని చోట్లా సినిమాకు రికార్డు స్థాయిలో ఆదరణ లభించింది.



* ఏడు భాషల్లోకి
సిద్ధార్థ్‌, త్రిష కలసి అలరించిన ప్రేమ కథా చిత్రం ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ . 2005లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ పెద్ద విజయాన్నే నమోదు చేసుకుంది. అది ఏ స్థాయి విజయం అంటే... ఆ తర్వాత సినిమా ఏడు భాషల్లోకి రీమేక్‌ అయ్యింది. శాండిల్‌వుడ్‌లో ‘నెన్నొళ్లె నన్నలె’ పేరుతో 2006లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. అదే ఏడాది ‘సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌’గా తమిళంలోకి జయం రవి తీసుకెళ్లాడు. మనలాగే అక్కడ కూడా సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. ‘రామయ్య వస్తావయ్యా’ పేరుతో ‘గిరీశ్‌ కుమార్‌’ కథానాయకుడిగా హిందీలోకి 2013లో రీమేక్‌ చేశారు. అయితే అక్కడ అనుకున్నంత స్పందన రాలేదు. 2007లో ‘ఐ లవ్‌ యూ’ (బెంగాళీ), 2009లో ‘సునా చదేహీ మొ రూపా చదేహీ’(ఒడియా)గా రీమేక్‌ అయ్యింది. మన దేశంలోనే కాక పక్క దేశాల్లోనూ ఈ సినిమా రీమేక్‌ అయ్యింది. 2010లో ‘నిషా అమర్‌ తుమి’గా బంగ్లాదేశీ బెంగాళీ భాషల్లో వచ్చింది. అదే ఏడాది ‘ఫ్లాష్‌బ్యాక్‌: ఫర్‌కెరా హెర్డా’గా నేపాలీ భాష





లో రీమేక్‌ అయ్యింది.
* కిక్‌ కిక్కే
కిక్‌ కోసం దేనికైనా వెనకాడని విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిగా రవితేజ కనిపించిన సినిమా ‘కిక్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర నిర్మాతలకు అదే స్థాయిలో కిక్‌ ఇచ్చింది. మన దగ్గరే కాదు బాలీవుడ్‌లోనూ అదే స్థాయిలో విజయం సాధించింది. 2014లో ఇదే పేరుతో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా హిందీలో సినిమా విడుదలైంది. సల్మాన్‌ పాత సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఈ సినిమాను కన్నడలో ‘సూపర్‌ రంగా’ పేరుతో ఉపేంద్ర చేశాడు. తమిళంలో ‘తిళ్ళాలంగడి’గా జయం రవి కథానాయకుడిగా సినిమా రూపొందింది. అక్కడ కూడా సినిమాకు మంచి వసూళ్లే దక్కాయి.



* మర్యాద రామన్నలు
సునీల్‌కి హీరోగా బ్రేక్‌ ఇచ్చిన సినిమా ‘మర్యాద రామన్న’. 2010లో రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మరో ఐదు భాషల్లోకి రీమేక్‌ అయ్యింది. తమిళంలో సంతానం కథానాయకుడిగా ‘వళ్ళవనుక్కు పుల్లుమ్‌ ఆయుధం’ విడుదలై మంచి విజయం అందుకుంది. హిందీలో అజయ్‌ దేవగణ్‌ హీరోగా ‘సన్నాఫ్‌ సర్దార్‌’ పేరుతో పునర్‌ నిర్మించారు. 2010లో మలయాళంలో ‘ఇవన్‌ మర్యాదరామన్‌’ గాను, ‘ఫాండే పొరియా బోగా కాండే రె’గా బెంగాళీలోనూ సినిమా రీమేక్‌ అయ్యింది. ఆ తర్వాత ఏడాది కన్నడలో ‘మర్యాదే రామన్న’గా వచ్చింది.




* ఇదీ ఐదు భాషల్లోకి
‘క్యారక్టర్‌ కొత్తగా ఉందని’ ఎన్టీఆర్‌ ట్రై చేసిన సినిమా ‘బృందావనం’. 2010లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనే కుటుంబ కథా చిత్రాల విషయంలో సరికొత్త ఊపును తీసుకొచ్చింది. ఆ తర్వాత మరో ఐదు భాషల్లోకి రీమేక్‌ అయ్యింది. 2010 ‘ ఖోకా 420’ పేరుతో బెంగాళీలో రీమేక్‌ చేశారు. అక్కడి రెండేళ్ల తర్వాత ‘లవ్‌ మాస్టర్‌’గా ఒడియాలో వచ్చింది. ఆ తర్వాత ఏడాది ‘బృందావన’ పేరుతో కన్నడలో పునర్‌ నిర్మించారు. రెండేళ్ల క్రితం మరాఠిలో ‘వృందావన’గా తీసుకొచ్చారు. వీటితోపాటు బంగ్లాదేశీ బెంగాళీలో ‘బక్‌ ఫేటే టో ముఖ్‌ ఫొటేనా’గా రీమేక్‌ చేశారు.


* బంగ్లాదేశ్‌ బెంగాళీలో
రవితేజ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమార్కుడు’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనకు తెలిసిందే. 2006లో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్‌లో మరపురానిది. ఈ సినిమా ఇక్కడే కాదు మరో ఐదు పరిశ్రమల్లో భారీ విజయాల్ని అందుకుంది. తమిళంలో కార్తి హీరోగా ‘సిరుతాయ్‌’ పేరుతో శివ తెరకెక్కించాడు. హిందీలో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో 2012లో వచ్చిన ‘రౌడీ రాథోడ్‌’... ‘విక్రమార్కుడు’కు రీమేకే. ఈ సినిమా బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. కన్నడలో సుదీప్‌ హీరోగా ‘వీర మడకరి’గా 2009లో వచ్చింది. బెంగాళీలో ‘బిక్రమ్‌ సింఘ’ పేరుతో 2012లో రీమేక్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌ బెంగాళీలో 2007లో వచ్చిన ‘ఉల్టా పల్టా’ ‘విక్రమార్కుడు’ రీమేకే.


* అన్నిచోట్లా వర్షమే
ప్రభాస్‌ కెరీర్‌లో ‘వర్షం’ ఓ బ్లాక్‌బస్టర్‌. అందమైన ప్రేమకథకు, కావల్సినంత కమర్షియల్‌ అంశాలు జోడింపుగా 2004లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తమిళంలో జయం రవి హీరోగా ‘మళై’ పేరుతో 2005లో రీమేక్‌ అయ్యింది. అక్కడ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఒడియాలో 2004లో ‘బర్షా మై డార్లింగ్‌’గా పునర్‌ నిర్మితమైంది. హిందీలో ‘బాఘి’ పేరుతో రెండేళ్ల క్రితం టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా ఈ సినిమా రీమేక్‌ చేశారు. అయితే అక్కడ కేవలం కథలో ప్రధానాంశాన్ని మాత్రమే తీసుకున్నారు.



* పోలీసు కథ

మహేష్‌బాబు కెరీర్‌ను ఒక్కసారిగా జెట్‌స్పీడ్‌కి తీసుకెళ్లిన చిత్రం ‘పోకిరి’. 2006లో వచ్చిన ఈ
సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలుకొట్టింది. ఈ సినిమా ఇక్కడే కాదు... హిందీ, తమిళ, కన్నడ పరిశ్రమల్లోనూ అదరగొట్టేసింది. తమిళంలో విజయ్‌ హీరోగా ‘పొక్కిరి’ పేరుతో 2007లో ఈ సినిమా రీమేక్‌ అయ్యింది. హిందీలో ‘వాంటెడ్‌’గా సల్మాన్‌ ఖాన్‌ 2009లో ఈ సినిమాను తీసుకెళ్లాడు. 2010లో ‘పొర్కి’ పేరుతో కన్నడలో సినిమా వచ్చింది. ఈ మూడు చోట్ల సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Comments

Popular posts from this blog

‘ప్రేమకి రెయిన్‌చెక్‌’ కథానాయిక ప్రియా వడ్లమాని telugu actress prriya vadlamani film pramaki rain check