‘అర్జున్ రెడ్డి’ 3... ‘విక్రమార్కుడు’ 5... ‘కిక్’ 3 ఇవి ర్యాంకులు కావు... రీమేక్‌లు ‘పక్కింటి పుల్ల కూర రుచి’... తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకునేటప్పుడల్లా ఈ మాటే అనేవారు. అక్కడెక్కడో విజయం సాధించిన సినిమాల్ని మనవాళ్లు తీసుకొచ్చి... మన మసాలా దట్టించి ప్రజలకు అందిస్తారని అనుకునేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు మారాయి. మనం సినిమాలు తెచ్చుకోవడం స్థానే మన సినిమాలు పక్క రాష్ట్రాల పరిశ్రమలకు వెళ్తున్నాయి. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ తమిళ, హిందీ పరిశ్రమలకు వెళ్లాడు. అలాగే ‘అత్తారింటికి దారేది’ తమిళంలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలుగులో విజయం సాధించి ఇతర పరిశ్రమలకు వెళ్లిన సినిమాలేంటో చూద్దాం! తెలుగు సినిమాలో ఇటీవల కాలంలో ట్రెండ్ సెట్టర్ అంటే ‘అర్జున్ రెడ్డి’ అని చెప్పొచ్చు. డాక్టర్ అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఈ బోల్డ్ పాత్ర ఒప్పుకున్నందుకు విజయ్‌పై ప్రశంసల వర్షం, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇప్పుడు ‘విజయ్’ పాత్రలోకి తమిళం నుంచి విక్రమ్ తనయుడు ధృవ్, హిందీ నుంచి షాహిద్ కపూర్ సిద్ధమయ్యారు. ఈ సినిమా తమిళంలో ‘వర్మ’...
నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచబోతున్నా అంటున్నారు ప్రియా వడ్లమాని. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రేమకి రెయిన్‌చెక్’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ప్రియా వడ్లమాని సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘తన ప్రపంచంలో తానుండే నేటితరం అమ్మాయి పాత్ర నాది. తనకంటూ జీవితంలో కొన్ని విలువలుంటాయి. సాహసోపేతమైన విషయాలతో ముడిపడ్డ ఓ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఆ పాత్ర పరంగా సినిమాలో పలు సాహసాలు చేయాల్సొచ్చింది. వ్యక్తిగతంగా నాకూ సాహసాలంటే ఇష్టం. అందుకే ఎలాంటి డూప్ లేకుండా నటించా. ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం’’. * ‘‘మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, వాళ్లు తిరిగి మనకు వెంటనే సహాయం చేయడానికి సిద్ధపడతారు. అలా కాకుండా నేను అడిగినప్పుడు సహాయం చేయండని అడిగితే దాన్నే రెయిన్ చెక్ అంటారు. ఈ చిత్రాన్ని ఆకెళ్ల పేరి శ్రీనివాస్ బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రారంభానికి ముందే ఒక వర్క్‌షాప్ చేయడంతో సులభంగా నటించగలిగా. నేను పుట్టి పెరిగ...
Comments
Post a Comment